నవతెలంగాణ-హైదరాబాద్: పాత మహిళా రిజర్వేషన్ బిల్లు (2023 లో ఆమోదించిన) ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షం శనివారం ప్రధాని మోడీకి లేఖ రాసింది. నేడు ఈ విషయంపై ఇండియా బ్లాక్ ఎంపీలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత సోనియాగాంధీ లోక్‌సభలో కీలక బిల్లులకు మెజార్టీ ఓటింగ్ లేకుండా చేసినందుకు ఆమె మిత్రపక్షాలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశం అనంతరం ఇండియా బ్లాక్ ఎంపీలు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ మీడియా సమావేవంలో మహిళా రిజర్వేషన్‌కు తాము మద్దతు ఇస్తున్నాము. కానీ ప్రభుత్వం రిజర్వేషన్ ముసుగులో దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చడానికి ప్రయత్నిస్తోందని ఇండియా బ్లాక్ పార్టీలు వివరించనున్నట్లు తెలుస్తోంది.
కాగా, నేడు కాంగ్రెస్ ఎంపి ప్రియాంక గాంధీ వాద్రా మీడియాతో మాట్లాడుతూ.. ‘అన్ని పార్టీలు ఆమోదించిన పాత మహిళా బిల్లును కేంద్రం సోమవారం నాడే వెంటనే పార్లమెంటు ముందుక తీసుకురావాలి. దీనికోసం సోమవారం నాడు పార్లమెంటు నిర్వహించమనండి. అప్పుడు బిల్లును సభ ముందుకు తెస్తే.. అసలు మహిళా వ్యతిరేకులు ఎవరో తెలుస్తుంది. పాత మహిళా బిల్లును తెస్తే మేమందరం కచ్చితంగా ఓటు వేసి దానికి మద్దతు ఇస్తాము’ అని అన్నారు.



