నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ ఐసిడిఎస్ ప్రాజెక్టు అంగన్వాడి విధుల్లో మారేపల్లి అంగన్వాడీ టీచర్ సుజాత అక్క ఆదర్శమని మద్నూర్ ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ కళావతి, ప్రాజెక్టు పరిధిలోని ఐసిడిఎస్ సూపర్వైజర్లు తెలిపారు. ప్రాజెక్టు పరిధిలోని డోంగ్లి సెక్టార్ పరిధిలోని మారేపల్లి అంగన్వాడి టీచర్ గా విధులు నిర్వహిస్తూ శనివారం ఆమె పదవి విరమణ పొందారు. అంగన్వాడి టీచర్ పదవి విరమణ కార్యక్రమం మద్నూర్ మండల కేంద్రంలోని మైథిలి ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ 4 మండలాల సూపర్వైజర్లు హాజరయ్యారు.
పదవి విరమణ పొందిన సుజాతకు ప్రాజెక్టు తరఫున శాలువా పూలమాలలతో సిడిపిఓ సూపర్వైజర్లు సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సిడిపిఓ సూపర్వైజర్లు మాట్లాడుతూ.. అంగన్వాడీ టీచర్ గా సుజాత విధుల్లో దాదాపు 40 సంవత్సరాలుగా ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. మద్నూర్ ఐ సి డి ఎస్ ప్రాజెక్టుకి సుజాత అక్క ఆదర్శమని అధికారులు ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ టీచర్లు ప్రశంసించారు. ఆమెను ఆదర్శంగా తీసుకొని ప్రతి అంగాన్వాడీ టీచర్ ముందుకెళ్దామని ప్రతి ఒక్కరూ కొనియాడారు.
సుజాత అంగన్వాడి టీచర్ గా రూ.225 నుండి ప్రస్తుతం రూ.13 వేల జీతంతో పదవి విరమణ పొందారని తెలిపారు. ఆమె పదవి విరమణ కార్యక్రమానికి ప్రాజెక్టు అధికారులు ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ టీచర్లు, మారేపల్లి గ్రామ సర్పంచ్ శ్రీధర్, దోతి సర్పంచ్ సంగ్రామ్, జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామ సర్పంచ్ సిఐటియు యూనియన్ గౌరవాధ్యక్షులు సురేష్ గొండ ,ఆ గ్రామ పెద్దలు అదే విధంగా మద్నూర్ మండల విలేకరులు సుజాతకు ప్రత్యేకంగా సన్మానాలు చేశారు.



