Saturday, April 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల ధర్నా

ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల ధర్నా

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
గత నెల 24 వ తేదీన అకాల వడగండ్ల వాన కురవడంతో 13 ఎకరాల వరి ధాన్యం పూర్తిగా ధ్వంసం అయిందని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన రైతులు రైతు వేదిక ముందు శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వడగండ్ల వర్షానికి తాను కౌలుకు చేసే మొత్తం 13 ఎకరాల వరి పంట నేలపాలైందని ఆదేదన వ్యక్తం చేశారు.

పంట నష్టాన్ని  ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, అధికారులు సందర్శించి పంట నష్టం అందిస్తామని హామీ ఇచ్చి నెల రోజులు గడుస్తున్న ఇప్పటివరకు ఎలాంటి పరిహారం అందలేదని ఆరోపిస్తూ ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం తమను ఆదుకోకపోతే ఆత్మహత్య శరణ్యం అన్నారు. విషయం తెలుసుకున్న వ్యవసాయ విస్తరణ అధికారినీ లత మాట్లాడుతూ అకాల వర్షం వల్ల 6 వందల ఎకరాల పంట నష్టం జరిగిందని, పంట నష్టం వివరాలను ఉన్నతాధికారులకు అందించడం జరిగిందన్నారు. పంట నష్ట పరిహారం రాగానే తప్పకుండా వారికి న్యాయం చేస్తామని తెలిపారు, ఈ కార్యక్రమంలో పంట‌ నష్టపోయిన రైతులు, తదితరులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -