Saturday, April 18, 2026
E-PAPER
Homeజిల్లాలుఈదురు గాలులకు విరిగిపడిన స్థంభాలు 

ఈదురు గాలులకు విరిగిపడిన స్థంభాలు 

- Advertisement -

నవతెలంగాణ – బల్మూరు 
మండల కేంద్రం బల్మూర్ లో శనివారం సాయంత్రం ఈదురు గాలులతో రెండు విద్యుత్ స్తంభాలు రోడ్డుపై చెట్లు విరిగిపడ్డాయి. ఒక్కసారిగా ఉరుములు ఈదురు గాలులు తీవ్రంగా వీచడంతో బస్టాండు సమీపంలోని రెండు మినీ ట్రాన్స్ఫార్మర్ విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. అదేవిధంగా బాలుర హాస్టల్ వద్ద చెట్టు విరిగి రోడ్డుపై పడింది. దీంతో గంటపాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సంఘటన సమయంలో అక్కడ పశువులు, గేదెలు, మనుషులు గానీ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈదురు గాలులు ఉరుగులు మెరుపులు వర్షాల కారణంగా పిడుగులు పడే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండవలసిందేనని పలువురు మాట్లాడుకుంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -