Saturday, April 18, 2026
E-PAPER
Homeజాతీయంకేంద్ర మంత్రి వ‌ర్గం కీలక నిర్ణయాలు

కేంద్ర మంత్రి వ‌ర్గం కీలక నిర్ణయాలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: పీఎం మోడీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన‌ మంత్రి వ‌ర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానమంత్రి గ్రామీణ్ సడక్ యోజన మూడోదశ 2028 వరకు కొనసాగింపునకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కోసం 83,977 కోట్ల రూపాయల కేటాయింపులు జరుగుతాయి. భారత్ మ్యారీ టైం ఇన్సురెన్స్ పూల్ ఏర్పాటు ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.నిరంతర సముద్రయాన బీమా కవరేజీ కోసం 12,980 కోట్ల రూపాయలు కేటాయింపులు ఉంటాయి. ప్రపంచ అస్థిరత భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో నౌకల బీమా కోసం ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. యుద్ధ ప్రమాద నష్టాలను కవర్ చేసేలా బీమా ఉంటుంది. రాజమండ్రి (నిడదవోలు)-(దువ్వాడ) మధ్య 3, 4వ రైల్వే లైన్ ట్రాక్ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 198 కిలోమీటర్ల రూట్లో, 458 కిలో మీటర్ల ట్రాక్ ఏర్పాటు కానుంది. 9,889 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది కేంద్ర ప్రభుత్వం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -