Saturday, April 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి న్యాయం చేయాలి

తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి న్యాయం చేయాలి

- Advertisement -

ఉద్యమ కారుల రాష్ట్ర సదస్సు కు తరలివెల్లిన ఉద్యమకారులు 
నవతెలంగాణ – మల్హర్ రావు

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులను ప్రభుత్వం తక్షణమే గుర్తించి, న్యాయం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి ముడితనపల్లి ప్రభాకర్ డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్‌లోని తార్నాకలో జరిగిన రాష్ట్ర స్థాయి సదస్సుకు జిల్లా మండలం నుండి ఉద్యమకారులు భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక కమిటీ వేసి ప్రతి ఉద్యమకారుడిని గుర్తించాలన్నారు.

జార్ఖండ్ తరహాలో ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, పెన్షన్, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవ చూపి సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో టియూఎఫ్ మండల అధ్యక్షులు బూడిద సతీష్, రాజు, చాంద్ పాష, కోట నవీన్,ఆకుల సదానందం,కోండ్ర సారయ్య, చిన్న గట్టయ్య,దుబాసి పార్వతి, జునగరి పద్మ, గడ్డం సమ్మక్క, రాజేశ్వరి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -