- Advertisement -
నవతెలంగాణ నాచారం : నాచారంలోని పారిశ్రామిక వాడలో టెంట్ హౌస్ గోదాంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గోదాంలోని సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. గోదాంకు అనుకొని ఉన్న పరుపుల కంపెనీకి సైతం మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది 30 నిమిషాలుగా మంటలను ఆర్పడానికి శ్రమిస్తున్నారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



