హీరో తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ కాంబోలో రాబోతున్న చిత్రం ‘గాయపడ్డ సింహం’. పవన్ సాధినేని సమర్పణలో కళ్యాణ చక్రవర్తి మం థిన, భాను కిరణ్ ప్రతాప, విజరు కష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. తాజాగా మేకర్స్ ‘జింగాలా’ సాంగ్ రిలీజ్ చేశారు. గాయపడ్డ సింహం(తరుణ్ భాస్కర్ ) మనసులో దాగి ఉన్న బాధను, ఆవేశాన్ని, తిరిగి లేచే శక్తిని అద్భుతంగా ఆవిష్కరించే పాటగా దీన్ని రూపొందించారు. స్వీకర్ అగస్తి సంగీతం ఈ పాటకు ఎలక్ట్రిఫైయింగ్ ఎనర్జీని అందించగా, నకాష్ అజీజ్ వోకల్స్ మరింత ఎనర్జీ ఇచ్చింది. కశ్యప్ శ్రీనివాస్, సునీల్ కరంకంటి, శ్రీని జోస్యులలిరిక్స్ తరుణ్ మనసులోని గాయాలు, కోపం, ప్రతీకారం అన్నీ ఫన్ నోట్లో ప్రజెంట్ చేశాయి. బాధను బీట్గా మార్చుకుని కంపోజ్ చేసిన పాటలో తరుణ్ భాస్కర్ పెర్ఫార్మెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సాంగ్ సోషల్ మీడియాలో ఇన్స్టంట్ హిట్గా నిలిచింది. మే 1వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది అని చిత్ర యూనిట్ తెలిపింది. విష్ణు ఓయి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి రచన, దర్శకత్వం: కాశ్యప్ శ్రీనివాస్, సమర్పణ: పవన్ సాధినేని, డీఓపీ : విద్యా సాగర్ చింత, సంగీతం: స్వీకర్ అగస్తీ, ఎడిటర్: విప్లవ్ నిషాదం, ప్రొడక్షన్ డిజైనర్: చంద్రిక గొర్రెపాటి, కథ: సూర్య ప్రకాష్ జ్యోసుల, క్రియేటివ్ ప్రొడ్యూసర్: శ్రీని జోస్యుల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పెన్మత్స అజరు వర్మ.



