నవతెలంగాణ-కమ్మర్ పల్లి
వేల్పూర్ మండల కేంద్రంలోని కేసీఆర్ కాలనీలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఒక స్కూటీ, ఒక బైకును పెట్రోల్ పోసి తగలబెట్టారు. కేసీఆర్ కాలనీలో నివాసం ఉంటున్న శ్రావణ్ కుమార్ గౌడ్ స్కూటీని గత వారం రోజుల కిందట కొనుగోలు చేసాడు. శనివారం రాత్రి సమయంలో ఇంటి బయట పార్క్ చేసి పడుకున్నాడు. గుర్తుతెలియని వ్యక్తులు శ్రావణ్ కుమార్ స్కూటీకి నిప్పు పెట్టడంతో పక్కనే పార్క్ చేసి ఉన్న వనం దాస్ మహేందర్ గౌడ్ బైక్ కూడా పాక్షికంగా దగ్ధమైంది. ఉదయం శ్రావణ్ కుమార్ గౌడ్ లేచి చూసేసరికి స్కూటీ తో పాటు బైక్ దగ్ధమై కనిపించింది. వెంటనే ఆయన పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సంజీవ్ తెలిపారు. బైకుల దహనానికి పాల్పడ్డ వారిని తప్పకుండా పట్టుకుంటామని తెలిపారు. కాగా స్కూటీ, బైక్ ను తగలబెట్టడం వెనక ఉన్నది గంజాయి తాగిన వ్యక్తుల? లేక కక్షపూరితంగా ఎవరైనా కక్ష కట్టి తగలబెట్టారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
స్కూటీ, బైక్ ను తగలబెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


