నవతెలంగాణ-కోహెడ
మండలంలోని నారాయణపూర్ గ్రామంలో అసిస్టెంట్ లైన్మెన్ గా విధులు నిర్వహిస్తున్న భూక్య సురేష్ (37) ఆదివారం విద్యుత్ షాక్ కు గురై మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని వ్యవసాయ బావుల వద్ద విద్యుత్ వైర్లు కిందికి ఉండడంతో సరిచేయాలని రైతులు కోరినట్లు తెలిపారు. కాగా సరి చేసేందుకు ఎల్సి తీసుకొని పనులు చేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. నాలుగు గ్రామాలకు ఒకే లైన్మెన్ ఉండడంతో పని భారం ఎక్కువ అవుతుందని పలువురు చర్చించుకున్నారు. స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు సురేష్ అక్కన్నపేట మండలం చెరువు ముందు తండా గ్రామానికి చెందినవాడు. అలాగే భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. అలాగే బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
విద్యుదఘాతంతో లైన్మెన్ మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



