- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్:
గత కొన్ని రోజులుగా ఎండ వేడికి నగర వాసులు అల్లాడిపోతున్నారు. మధ్యాహ్నం 12 దాటిన తర్వాత రోడ్లపై జనాలు కనిపించడమే గగనమైపోయింది. ఇంట్లో ఉంటున్న వారు ఫ్యాన్ వేసుకుని సేదతీరుదామంటే వేడి గాలితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఫ్యాన్ ఆపేస్తే భరించలేని ఉక్కపోత.. ఇలాంటి పరిస్థితుల్లో పట్టణ ప్రజలపై వరుణుడు కాస్తంత జాలి చూపించాడు. ఆదివారం కూకట్పల్లి, మూసాపేట్, జేఎన్టీయూ, నిజాంపేట్, కేపీహెచ్బీ, జీడిమెట్ల ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో వేడి తాపానికి కాలిపోతున్న భూమి చల్లగా మారింది. ఈ పరిణామాలతో నగర వాసులు చల్లని ఊపిరి పీల్చుకున్నారు. సాయంత్రం సరదాగా బయటకు వచ్చి చల్లగాలిని ఆస్వాదించారు.
- Advertisement -



