Sunday, April 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొనుగోలు కేంద్రాల్లోనే మక్కలు అమ్ముకోవాలి

కొనుగోలు కేంద్రాల్లోనే మక్కలు అమ్ముకోవాలి

- Advertisement -

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి 
నవతెలంగాణ – మిడ్జిల్ 

రైతులు పండించిన పంటలు ప్రభుత్వము మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని, కొనుగోలు కేంద్రాలలోనే రైతులు మక్కాలను అమ్ముకోవాలని, దళారులను ఆశ్రయించి మోసపోవద్దని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో జడ్చర్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి సభ్యులు గౌస్ రబ్బాని తో కలిసి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

 రైతులు పండించిన మక్కలకు సరైన ధర అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మధ్యవర్తుల ఇబ్బందులు లేకుండా రైతులు నేరుగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చి విక్రయించుకోవాలని సూచించారు. రైతులకు మద్దతుగా ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, పారదర్శకంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను కొనసాగిస్తామని తెలిపారు.

రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం, చెల్లింపులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అడిగిన వెంటనే కొనుగోలు కేంద్రం మంజూరు చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావుకు   ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందుకు రాణి పట గ్రామంలో చలివేంద్రాన్ని స్థానిక సర్పంచి మాధవి మల్లేష్ తో కలిసి ప్రారంభించారు. గ్రామాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేసిన నందుకు  సర్పంచ్ని అభినందించారు.

అనంతరం మసి గడ్లపల్లి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి సిద్ధార్థ, పిఎసిఎస్ సి ఓ బాల్ రెడ్డి,  సర్పంచులు, ఎడ్ల శంకర్ ముదిరాజ్, గోదా శ్రీశైలం యాదవ్, ధర్మానాయక్ ,  రాజు నాయక్, రాములు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మహమ్మద్ గౌస్ ,వెంకటయ్య, బాలయ్య, సాయిలు, జహంగీర్, కంచనపల్లి నరసింహ, బాబా, శంకర్ నాయక్, రాజు నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -