నవతెలంగాణ – భీంగల్
భీంగల్ పట్టణంలో వీధి కుక్కల బెడద రోజురోజుకు పెరుగుతుంది. శనివారం రాత్రి జరిగిన విషాద ఘటనలో ఓ బాలుడు కుక్కల దాడికి గురై తీవ్రంగా గాయపడిన ఘటన ప్రజలను భయాందోళనలకు కారణమవుతోంది. పట్టణంలో కుక్కలు అకస్మాత్తుగా దాడి చేయడంతో ఏడుగురు చిన్నారులు గాయపడినట్లు స్థానికులు తెలిపారు. ఈ సంఘటనతో పట్టణ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో వీధుల్లో తిరగడం కూడా ప్రమాదకరంగా మారిందని వాపోతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి నెలకొందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు వెంటనే చర్యలు తీసుకుని వీధి కుక్కలను పట్టివేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
బాలుడిపై వీధి కుక్కల దాడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



