నవతెలంగాణ – ఆలేరు రూరల్
శిబిరాల ద్వారా అందిస్తున్న ఉచిత కంటి పరీక్షలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కంటి వైద్యురాలు డాక్టర్ మౌనిక సూచించారు. హబ్సిగూడలోని నియో విజన్ ఐ కేర్ & లేజర్ సెంటర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలోని రైతు వేదికలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో మొత్తం 150 మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డా. మౌనిక మాట్లాడుతూ కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభ దశలోనే పరీక్షలు చేయించుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చన్నారు. అలాగే శిబిరాల ద్వారా అందిస్తున్న ఉచిత చికిత్స, శస్త్రచికిత్స అవకాశాలను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మేనేజర్లు కార్తీక్, ఉపేందర్, వైద్య సిబ్బంది మహమ్మద్ కయుద్దిన్, అనూష, స్వామి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
ఉచిత కంటి పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలి: డా.మౌనిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



