Sunday, April 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బసవేశ్వరుడి జయంతి వేడుకల్లో సర్పంచ్ ఉషా-సంతోష్ మేస్త్రి

బసవేశ్వరుడి జయంతి వేడుకల్లో సర్పంచ్ ఉషా-సంతోష్ మేస్త్రి

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
శ్రీ మహాత్మా బసవేశ్వర గొప్ప మహనీయుడని మద్నూర్ గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి పేర్కొన్నారు. మండల కేంద్రంలో మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకల్లో ఆమె పాల్గొని మహాత్మా బసవేశ్వర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తూ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఉష మాట్లాడుతూ సమాజంలో కుల వ్యవస్థను వర్ణ భేదాలను లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయ వాది శ్రీ మహాత్మా బసవేశ్వర అన్నారు. ఈ కార్యక్రమంలో లింగాయత్ సమాజ్ మద్నూర్ గ్రామ అధ్యక్షులు సంతోష్ జుబ్రి బసవేశ్వర జెండాను ఆవిష్కరించారు.

ఈ జయంతి వేడుకల్లో గ్రామ ఉపసర్పంచ్ రమేష్ లింగాయత్ సమాజ్ పెద్దలు, ప్రముఖులు రామ్ పటేల్ సిర్పూర్, రామ్ పటేల్ పెద్ద షక్కర్గ, పండిత్ రావు పటేల్ ఎక్లారా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధరాస్ సాయిలు, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బన్సీ పటేల్, బిజెపి మండల పార్టీ అధ్యక్షులు తెప్ప తుకారం, పెద్ద ఎక్లారా సర్పంచ్ మహేష్ కుమార్, చిన్న ఎక్లారా సర్పంచ్ మాధవరావు, మద్నూర్ మాజీ సర్పంచ్ సురేష్ ,డాక్టర్ బండి విజయ్, అశోక్ పటేల్ మదన్ హిప్పర్గా, నాగేష్ పటేల్ కుర్లా, వై గోవింద్ మేనూర్, మద్నూర్ గ్రామ లింగాయత్ సమాజ్ నాయకులు సంఘయప్ప, శివాజీ అప్ప, మద్నూర్ గ్రామ లింగాయత్ సమాజ్ పెద్దలు యువకులు మండలంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన పెద్దలు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -