- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఇటలీలోని బెర్గామో ప్రావిన్స్‌లో కాల్పుల కలకలం రేపింది. కోవో ప్రాంతానికి చెందిన ఇద్దరు భారతీయులు రాజిందర్ సింగ్ (48), గుర్మిత్ సింగ్ (48) సాయుధుడి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. వైశాఖి పండగ సందర్భంగా గురుద్వారా నుంచి బయటకు వస్తున్న సమయంలో వీరిపై కాల్పులు జరిగినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఘటన అనంతరం నిందితుడు కారులో పరారయ్యాడు. ఘటనపై ప్రారంభంలో వివాదం కారణంగా జరిగిన ఘర్షణగా భావించినప్పటికీ, అధికారులు దానిని కొట్టిపారేశారు. ఇది పక్కా ప్రణాళికతో జరిగిన హత్యగా అనుమానిస్తూ దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



