నవతెలంగాణ-హైదరాబాద్: డిలిమిటేషన్ తో కలిపి మహిళ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో బీజేపీ ప్రవేశ పెట్టిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటి ముగియనుంది. ఈక్రమంలో పార్టీ తరుపున వెలిచారి నియోజకవర్గంలో ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఖర్గే మాట్లాడుతూ.. సదురు బిల్లుపై చర్చించడానికి ఆల్ పార్టీ మీటింగ్‌ను కూడా బీజేపీ తిరస్కరించిందని ఆయన విమర్శించారు. డిలిమిటేషన్ తో పాటు చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును పెట్టి రాజ్యాంగానికి చేటు చేయాలని ప్రమాదకర ఆటలు ఆడుతుందని ఆయన మండిపడ్డారు.
జనాభాను విజయవంతంగా నియంత్రించిన తమిళనాడు వంటి రాష్ట్రాలను శిక్షించడమే దీని అర్థం. ప్రతిపక్షం ఐక్యంగా నిలవగా, ఢిల్లీలోని కాంగ్రెస్ ముందుండి నడిపించిందన్నారు. అలాగే, ఈ బిల్లును ఓడించడానికి డీఎంకే, టీఎంసీ, ఎస్పీ అన్నీ భుజం భుజం కలిపి నిలబడ్డాయని తెలియజేశారు. ఇది ప్రజా వ్యతిరేకమని, దక్షిణాది వ్యతిరేకమని ఆయన అన్నారు. ఇది దేశంలోని ప్రతి పౌరుడి విజయం. ఇది సమాఖ్యవాదానికి, న్యాయానికి లభించిన విజయమన్నారు.



