Tuesday, April 21, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్కొలువుల జాతర..643 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

కొలువుల జాతర..643 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌)లో ఖాళీగా ఉన్న వివిధ కేటగీరీల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 643 ఖాళీలను ప్రత్యక్ష నియామక పద్థతిలో భర్తీ చేేసందుకు ఆర్థిక శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రక్రియను డిపార్ట్‌మెంటల్‌ సెలక్షన్‌ కమిటీ ద్వారా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి కమిటీ కూర్పు, ఎంపిక విధానంపై వైద్య ఆరోగ్య శాఖ విడిగా ఉత్తర్వులు జారీ చేయనుంది. రోస్టర్‌ పాయింట్లు, అర్హతలు, స్థానిక క్యాడర్‌ వివరాల ఆధారంగా నోటిఫికేషన్‌ను వీలైనంత త్వరగా విడుదల చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. భర్తీ చేయనున్న 643 పోస్టులలో వైద్యులు, నర్సులు, ఇతర సాంకేతిక సిబ్బంది పోస్టులు ఉన్నాయి. ఇందులో స్టాఫ్‌ నర్స్‌లు 375, ప్రొఫెసర్‌ 6, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ 7, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ 43 ఉన్నాయి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -