- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఈశాన్య రాష్ట్రాలను మరోసారి భూప్రకంపనలు వణికించాయి. ఈరోజు ఉదయం మణిపూర్ కేంద్రంగా భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో మణిపూర్‌తో పాటు నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోనూ భూమి కంపించింది. తెల్లవారుజామున ప్రజలంతా నిద్రలో ఉండగా ఈ ఘటన జరగడంతో భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సీఎస్) వెల్లడించిన వివరాల ప్రకారం, ఈరోజు ఉదయం 5:59 గంటలకు ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.2గా నమోదైంది. భూకంప కేంద్రం మణిపూర్‌లోని కామ్‌జాంగ్ జిల్లాలో, భూమికి 62 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
- Advertisement -



