Wednesday, September 2, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంయాపిల్‌ కొత్త సీఈఓగా జాన్‌ టెర్నస్‌

యాపిల్‌ కొత్త సీఈఓగా జాన్‌ టెర్నస్‌

- Advertisement -

నవతెలంగాణ- హైదరాబాద్ : యాపిల్‌ కొత్త సీఈఓగా జాన్‌ టెర్నస్‌ బాధ్యతలు చేపట్టారు. దీంతో సంస్థలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. టెర్నస్‌ సీఈఓగా.. టిమ్‌ కుక్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా కొత్త బాధ్యతల్లోకి వెళ్లారు. ఈ ఇద్దరి కొత్త వేతన ప్యాకేజీలను యాపిల్‌ వెల్లడించింది. కొత్త సీఈఓ జాన్‌ టెర్నస్‌కు ఈ ఆర్థిక సంవత్సరానికి దాదాపు 58 మిలియన్‌ డాలర్ల ప్యాకేజీ అందుతుంది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.551 కోట్లు. ఇందులో 3 మిలియన్‌ డాలర్లు వార్షిక వేతనం. వచ్చే ఆర్థిక సంవత్సరానికి 55 మిలియన్‌ డాలర్ల విలువైన షేర్లు కూడా ప్యాకేజీలో ఉన్నాయి.మరోవైపు టిమ్‌ కుక్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా సుమారు 47 మిలియన్‌ డాలర్లు అందుకోనున్నారు. ఇందులో 2 మిలియన్‌ డాలర్లు వేతనం. మరో 45 మిలియన్‌ డాలర్ల విలువైన షేర్లు ఉన్నాయి. సీఈఓగా ఉన్నప్పుడు కుక్‌కు 3 మిలియన్‌ డాలర్ల వార్షిక వేతనం ఉండేది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -