Tuesday, April 21, 2026
E-PAPER
Homeతాజా వార్తలుబసవేశ్వరుడికి నివాళులర్పించిన కల్వకుంట్ల కవిత

బసవేశ్వరుడికి నివాళులర్పించిన కల్వకుంట్ల కవిత

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: బసవేశ్వరుడి 839వ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ పై ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. బసవేశ్వరుడి రూపంలో కొత్త విప్లవం పుట్టింది. ఆ రోజు ఆయన పాటించిన ప్రజాస్వామిక విలువలు, తీసుకువచ్చిన మార్పులను మనం ఈ రోజుకూ స్మరించుకుంటు కుల, వర్ణ, లింగ బేధాలు లేకుండా సమానత్వం ఉండాలని బసవేశ్వరుడు చెప్పారు. ఆయన చెప్పిన సమానత్వం, సమాన అవకాశాల కోసం మనం ఈ రోజుకు పాటు పడుతున్నాం అంటే మనం వెనుకబడి ఉన్నట్టు లెక్క పార్లమెంట్ లో మహిళా బిల్లును పాస్ కాకుండా అనేక శక్తులు కుట్రలు చేసి అడ్డుకున్నాయి. ఈ బిల్లు పాస్ అయితే బాగుండేది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పార్టీ మహిళలకు ఎనిమిది సీట్లు ఇస్తే మరో పార్టీ పది సీట్లు ఇచ్చింది. మొత్తంగా అసెంబ్లీలో ఎనిమిది మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. బసవేశ్వరుడి నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తి పొందారు. బసవేశ్వరుడి స్ఫూర్తితో తాము ఏర్పాటు చేయబోయే రాజకీయ సామాజిక న్యాయం కోసం పని చేస్తుంది. 33 శాతం టికెట్లు, పార్టీ పదవులు మహిళలకు ఇస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -