- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హంగేరీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో పీటర్ మాగ్యార్ నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అధికారం చేపట్టిన వెంటనే, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును ఉద్దేశించి మాగ్యార్ చేసిన ప్రకటన అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. నెతన్యాహు హంగేరిలో అడుగుపెడితే అరెస్టు చేసే అవకాశం ఉందని, ఎందుకంటే అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఇప్పటికే నెతన్యాహుపై అరెస్టు వారెంట్ జారీ చేసిందని మాగ్యార్ స్పష్టం చేశారు.
- Advertisement -



