నవతెలంగాణ – కుభీర్
మండలంలోని రంగశివిని తండా 1కు చెందిన రాథోడ్ పిరాజీ అనే రైతు కు సంబదించిన ఎద్దు మంగళవారం ఉదయం పిడుగు పాటుకు గురై మృత్యువాత చెందింది. రైతు తెలిపిన వివరాల ప్రకారం.. రోజు మాదిరిగానే మంగళవారం ఉదయం సమయంలో తన వ్యవసాయ క్షేత్రంలో ఉన్న చెట్టుకు రెండు ఎద్దులను కట్టి తిరిగి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన కొద్దీ సమయంలోనే ఒక్కసారిగా ఉరుములు మెరుపులు మెరియడంతో చెట్టు కట్టేసిన రెండు ఎద్దుల్లో నుంచి ఒక్క ఎద్దు తాడు తెంపుకొని పరిగెత్తింది. అక్కడే ఉన్న ఒక్క ఎద్దుపై పిడుగు పడడంతో అక్కడిక్కడే మృత్యువాత చెందిందని తెలిపారు. వెంటనే రైతు గ్రామస్తులు వెంటనే పశు వైద్యాధికారి విశ్వజిత్ రెవెన్యూ అధికారి ఆర్ ఐ శ్రీనివాస్ కు సమాచారం అందించడంతో వారు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. ఎద్దు విలువ సుమారు రూ.80వేలు ఉంటుందని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తామని తెలిపారు.
పిడుగు పాటుతో ఎద్దు మృత్యువాత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



