Tuesday, April 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ-  కామారెడ్డి
కామారెడ్డి నియోజకవర్గంలోని బీబీపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాల లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గౌరవ కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద కుటుంబాల ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాల ప్రయోజనాన్ని పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రిత్విక సాయినాథ్, జనగామ గ్రామ సర్పంచ్ మట్ట శ్రీనివాస్, ఉపసర్పంచ్ స్వామి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు.

మాచారెడ్డి, పల్వంచ రైతు వేదికల్లో కల్యాణ లక్ష్మి – షాది ముబారక్ చెక్కుల పంపిణీ
కామారెడ్డి నియోజకవర్గంలో పేద కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాల చెక్కులను కామారెడ్డి ఎమ్మెల్యే మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాచారెడ్డి మండల కేంద్రంలోని రైతు వేదికలో, పల్వంచ మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల పరిధిలోని గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాలకు అతిథిగా హాజరైన కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు పెళ్లిళ్ల సమయంలో సహాయం అందించేందుకు ఈ పథకాలు ఎంతో దోహదపడుతున్నాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -