- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం జశ్‌పుర్ జిల్లాలోని కొండ ప్రాంతంలో ప్రయివేటు జెట్ కుప్పకూలింది. అటవీ ప్రాంతంలో చెట్టును ఢీకొన్న తర్వాత ఇది కూలిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు చనిపోయినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలిలో మంటలు ఎగసిపడటంతో పాటు పొగ దట్టంగా అలముకుంది. ప్రయివేటు జెట్‌లో ఎంత మంది ప్రయాణించారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



