నవతెలంగాణ-హైదారాబాద్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సీఎం ఎంకే స్టాలిన్‌ను సోమవారం కలిశారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా వెల్లడించారు. డీఎంకే ప్రభుత్వంలో విద్యా, ఆరోగ్యం, మహిళాల సాధికారత తదితర రంగాల్లో పలు మార్పులు జరిగాయని కేజ్రీవాల్ అన్నారు. తాము ఎల్లప్పుడూ ఒకరి నుండి ఒకరు నేర్చుకుంటూనే ఉన్నామని, తమిళనాడు ప్రజల జీవితాలను మార్చడంలో ఎంకే స్టాలిన్ అంకితభావంతో పని చేశారని అభినందించారు, విద్య, ఆరోగ్య సంరక్షణ, మహిళా సాధికారత విషయంలో ఇరువురికి ఒకే విధమైన దృక్పథం ఉంది.” అని కేజ్రీవాల్ పోస్ట్ చేశారు. ఈనెల 23న తమిళనాడులో పోలింగ్ జరగనుండగా, మే 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల వేళ..తమిళనాడు వెళ్లిన కేజ్రీవాల్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



