- Advertisement -
నవతెలంగాణ-హైదారాబాద్: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో డీఎంకే, దాని మిత్రపక్షాలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఆట, పాటలతో వాడ, వాడాల ప్రచారన్ని హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలోనే కార్యకర్తల్లో, ఓటర్లను చైతన్యవంతం చేయడానికి మక్కల్ నీది మైయం (MNM)అధినేత, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ హైలెవల్ సాంగ్‌ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ‘ఇది విజయ సైన్యం. పక్కకు తప్పుకోండి, పక్కకు తప్పుకోండి” తమిళనాడు విజయాన్ని చాటిచెబుతున్న ద్రావిడ సింహ గర్జన నాయకుడు ఇక్కడే ఉన్నాడు, ఇప్పుడు ఇది మీ చేతుల్లో ఉంది. మంచివాళ్ళు వింటే, దయచేసి దీన్ని విస్తృతంగా ప్రచారం చేయండి” అని ఆయన Xలో పిలుపునిచ్చారు.
- Advertisement -



