మల్లికార్జున వైన్ షాప్ లో ఎక్సైజ్ సీఐ తనిఖీ
నవతెలంగాణ-వర్ధన్నపేట
వినియోగదారులు కొనుగోలు చేసిన కెఎఫ్ బీరులో కచ్చరాగ ఫంగస్ అవశేషాలు గుర్తించడంతో బీరు బాటిల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. స్పందించిన ఎక్సైజ్ సీఐ స్వరూప వర్ధన్నపేట పట్టణంలోని మల్లికార్జున స్వామి వైన్ షాపులో తని తనిఖీ చేసి బీరు బాటిల్ శాంపిల్ సేకరించారు. వినియోగదారుడు కొనుగోలు చేసిన బీరు బాటిల్లో కచర పురుగు అవశేషాలు, ఫంగస్ ఉన్నట్లు అనుమానం రావడంతో పాటు వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై వర్ధన్నపేట ఎక్సైజ్ సీఐ స్వరూప వైన్ షాపును సందర్శించి బీరు నిల్వలను తనిఖీ చేశారు. ఈ విషయంపై ఎక్సైజ్ సీఐ స్వరూప లో వివరణ కోరగా బీరు నిల్వ నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపనున్నట్లు తెలిపారు. నాణ్యత ప్రమాణాలపై పూర్తిస్థాయి విచారణ చేసి పై అధికారులకు తాము నివేదిక అందిస్తామన్నారు.
బీరు బాటిల్ లో కచరా.. వీడియో వైరల్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



