నవతెలంగాణ – మిడ్జిల్
మట్టితో చేసిన కుండలో నీళ్లు త్రాగితే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, సర్పంచ్ సువర్ణ చెప్పారు. సోమవారం మండలంలోని వెలుగొమ్ముల గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్ర కేంద్రాన్ని వార్డు మెంబర్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సువర్ణ మాట్లాడుతూ.. వేసవికాలంలో ఎండలు తీవ్రం కావడంతో ప్రజలుకు తాగునీటికి ఇబ్బందులు ఏర్పడ వద్దని చల్లని నీటిని అందించాలని చలివేంద్రాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. గ్రామ ప్రజలతోపాటు, పశువుల కాపరులకు గొర్ల కాపరులకు నీటి సౌకర్యం చదివినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు లక్ష్మారెడ్డి రాజేందర్ రెడ్డి, చీమిడి రాములు, కృష్ణయ్య, గ్రామపంచాయతీ వార్డు మెంబర్లు గ్రామ పెద్దలు పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
మట్టి కుండనీళ్లు తాగితేనే ఆరోగ్యం: సర్పంచ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



