Monday, April 20, 2026
E-PAPER
Homeఖమ్మంవిద్యాశాఖ సంక్షేమ వారోత్సవాలు 

విద్యాశాఖ సంక్షేమ వారోత్సవాలు 

- Advertisement -

– వసతిగృహాల్లో విస్తృత తనిఖీలు 
– కాలం చెల్లిన పదార్థాలు గుర్తింపు 
నవతెలంగాణ – అశ్వారావుపేట 

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా విద్యాశాఖ చేపట్టిన సంక్షేమ వారోత్సవాలు లో మండలంలోని పలు ఆశ్రమ,వసతి గృహాల్లో మండల స్థాయి అధికారులు సోమవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. మండల పరిధిలోని అనంతారం బాలికల ఆశ్రమ పాఠశాలను ఎంఈఓ ప్రసాదరావు సందర్శించారు. వంటశాల పరిశుభ్రత,వంట పాత్రల పరిశుభ్రత,మెనూ ఫాలో అవుతున్నారా లేదా మొదలగు అంశాలను పరిశీలించారు.పాఠశాలలో మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు.గత నెలలో సందర్శించినప్పటికీ ఇప్పటికీ కొన్ని తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు.స్టోర్ రూమ్ లోని సరుకులను సక్రమంగా భద్రపరచాలి అని సూచించారు.కాలం చెల్లిన (ఎక్స్పైరీ  )  కారం,పసుపు ప్యాకెట్లు ఉంటే తొలగించాలని ఆదేశించారు.

సీడీపీఓ,మండల పరిషత్ ప్రత్యేక అధికారి డాక్టర్ ప్రదీప్ కుమార్,కావడి గుండ్ల  అనంతారం పాఠశాలలను పరిశీలించారు. తహశీల్దార్ దాసరి కిశోర్ మైనారిటీ గురుకుల పాఠశాలను సందర్శించారు. ఎస్ సీ కళాశాల బాలుర వసతి గృహాన్ని,పాఠశాల బాలుర వసతి గృహాన్ని ఎంపీడీవో అప్పారావు సందర్శించారు.ఎస్టీ బాలుర వసతి గృహాన్ని ఎంపీఓ రామ కోట రెడ్డి సందర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -