నవతెలంగాణ – మునుగోడు
మునుగోడు మండలంలో సెన్సెస్ 2027 నిర్వహణకు సంబంధించిన విధుల్లో సమయపాలన మార్పు చేయాలని కోరుతూ సోమవారం టీఎస్ యుటిఎఫ్ మునుగోడు మండల యూటీఎఫ్ ప్రతినిధులు మండల తాసిల్దార్ నేలపట్ల నరేష్ కి వినతిపత్రాన్ని అందజేశారు. వేసవి కాలంలో ఎండలు అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతము ఎనిమిది గంటల నుంచి 5 గంటల వరకు ఉన్న సమయాన్ని మార్చి, ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు శిక్షణను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా, సెన్సెస్ శిక్షణ తరగతులను వేసవి, ఎండల దృష్ట మునుగోడు మండల కేంద్రంలో కాకుండా నల్లగొండ జిల్లా కేంద్రంలో శిక్షణలను నిర్వహించాలని కోరారు. ఎండ వేడి వల్ల ఉపాధ్యాయులకు ప్రయాణ భారం తగ్గి, సమర్థవంతమైన శిక్షణ అందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి గేర నరసింహ మాట్లాడుతూ, ఉపాధ్యాయుల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా వేసవి కాలంలో అనుకూలమైన సమయపాలన అవసరమని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు కావాలంటే ఫీల్డ్ సిబ్బందికి అనుకూల వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మునుగోడు మండల అధ్యక్షుడు బిక్కుమళ్ళ రాములు, ప్రధాన కార్యదర్శి పెరిక నరసింహ తదితరులు పాల్గొన్నారు.



