Monday, April 20, 2026
E-PAPER
Homeమానవివేసవి తాపానికి నిమ్మ రసాలు

వేసవి తాపానికి నిమ్మ రసాలు

- Advertisement -

వేసవి తాపం నుంచి ఉపశమనం పొందాలంటే రోజువారీ ఆహారంలో కొన్ని మార్పులు తప్పనిసరిగా చేసుకోవాలి. అలాంటివాటిలో నిమ్మకాయ ఒకటి. ఇందులో సహజంగా ఉండే సి విటమిన్‌ శరీరాన్ని సంరక్షించడంలో మేలు చేస్తుంది. నిమ్మకాయతో చేసే వివిధ రకాల జ్యూసులు ఇలా తయారుచేసుకోవచ్చు.
పెప్పర్‌ లెమన్‌ వాటర్‌ : ఒక గ్లాసు నీటిలో రెండు స్పూన్ల నిమ్మరసం, రెండు టేబుల్‌ స్పూన్ల పంచదార, పావు టీస్పూను చొప్పున ఉప్పు, మిరియాల పొడి, చాట్‌ మసాలా వేసి బాగా కలపాలి. ఇందులో రెండు ఐస్‌క్యూబ్స్‌ వేసి తీసుకుంటే చల్లగా ఉండడమే కాకుండా వేసవి తాపం నుండి ఉపశమనం ఇస్తుంది.
పుదీనా లెమన్‌ వాటర్‌ : ముందుగా పది నుంచి పన్నెండు పుదీనా ఆకులు, రెండు టేబుల్‌ స్పూన్ల పంచదార, పావు టీస్పూను ఉప్పు మిక్సీజార్‌లో వేసి రుబ్బుకోవాలి. లేదా దంచుకోవచ్చు. ఒక గ్లాసు మంచినీళ్లు తీసుకొని అందులో ఈ పేస్టు, రెండు టీ స్పూన్ల నిమ్మరసం, పావు టీ స్పూను జీలకర్ర పొడి కలిపాలి. రెండు ఐస్‌ క్యూబ్స్‌ వేస్తే చల్లగా తాగేయొచ్చు.
జీరా లెమన్‌ వాటర్‌ : ఒక గ్లాసు నీటిలో రెండు టీ స్పూన్ల నిమ్మరసం, రెండు టేబుల్‌ స్పూన్ల పంచదార, పావు టీస్పూన్‌ చొప్పున ఉప్పు, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి. ఈ నీళ్లల్లో రెండు ఐస్‌క్యూబ్స్‌ వేసి తీసుకుంటే చల్లగా ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -