– నీటిపారుదల శాఖ జగిత్యాల యూనిట్ ముఖ్య ఇంజనీర్ సుమతీ దేవి
– మరమ్మతు పనుల పురోగతి పరిశీలన
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మే నెల చివరి నాటికి వరద కాలువ కిలోమీటర్ 16.30 వద్ద గండి మరమత్తు పనులు పూర్తి కావాలని నీటిపారుదల శాఖ జగిత్యాల యూనిట్ ముఖ్య ఇంజనీర్ సుమతీ దేవి అధికారులను ఆదేశించారు.మోర్తాడ్ మండలం గాండ్లపేట్ గ్రామ శివారులో ఇందిరమ్మ వరద కాలువకు గండి పడిన ప్రదేశంలో మరమ్మతు పనులలో భాగంగా కొనసాగుతున్న నిర్మాణ పనుల పురోగతిని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు కాంట్రాక్టర్ కు పలు సూచనలు చేశారు.
ఇందిరమ్మ వరద కాలువ గండి మరమ్మతు పనులను నాణ్యతతో చేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం కొనసాగుతున్న పనుల పురోగతిని శ్రీరాం సాగర్ ప్రాజెక్టు ఎస్ ఈ జగదీష్ ను అడిగి తెలుసుకున్నారు. గండి మరమ్మతు నిర్మాణ పనుల్లో ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా, పూర్తి నాణ్యతతో పనులు చేయాలని ఎస్ఎల్ఎన్ఎస్ సంస్థ ప్రతినిధిలకు సూచించారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి వరద కాలువను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ప్రస్తుతం పనులు కొనసాగుతున్న తీరు పట్ల ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఇందిరమ్మ కాలువ ఉప కార్య నిర్వహక ఇంజనీర్ గణేష్, ఏఈఈలు కొండ వంశీ, పవన్, ఎస్ఎల్ఎన్ఎస్ సంస్థ ప్రతినిధి చందు, తదితరులు పాల్గొన్నారు.



