Monday, April 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎంఆర్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి

సీఎంఆర్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి

- Advertisement -

జిల్లాలో పౌరసరఫరాల శాఖలో జరుగుతున్న ప్రజాధనం దుర్వినియోగం..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్

మిల్లుల నుండి సీఎంఆర్ రైస్ బకాయాలను వెంటనే విడుదల చేయాలని ప్రజా కళాకారుడు బాదే నరసయ్య అన్నారు. సోమవారం బాధితులతో కలిసి కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పౌరసరఫరాల శాఖలో జరుగుతున్న ప్రజాధనం దుర్వినియోగం పై కఠినంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 2014 నుండి ఇప్పటివరకు వందల కోట్ల రూపాయల సీఎంఆర్ బియ్యం బకాయిలు ఉన్నట్లు తెలిపారు. జిల్లా యంత్రాంగం వాటిని వసూలు చేయడంలో తీవ్రంగా విఫలమైందని అన్నారు.

సుదీర్ఘకాలం బియ్యం తిరిగి ఇవ్వని రైస్ మిల్లులపై కేసులు నమోదు చేయకపోవడం, వాటిని బ్లాక్ లిస్టులో పెట్టకపోవడం వల్లనా తెలంగాణ ప్రభుత్వంనికి ప్రజలకు భారీ నష్టం వాటిల్లిందని అన్నారు.వెంటనే స్పందించి జిల్లాలోని పెండింగ్లో ఉన్న సీఎంఆర్ బకాయిలని ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారం వడ్డీతో సహా వసూలు చేసి విధుల్లో నిర్లక్ష్యం వహించిన సంబంధిత అధికారులపై శాఖా పరమైన చర్యలు తీసుకొని బకాయి పడ్డ రైస్ మిల్లుల యాజమాన్యంపై చట్ట పరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళలు ఝాన్సీ ఎంకమ్మ వీరమ్మ జ్యోతి నాగమ్మ తదితర మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -