క్షేత్రస్థాయిలో పరిశీలించి కొనుగోలు కేంద్రాన్ని మంజూరు చేస్తాం
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
నవతెలంగాణ – బోనకల్
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోని బోనకల్ మండల పరిధిలోనే పెద్ద బీరవల్లి సొసైటీకి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంజూరు చేయాలని పెద్ద బీరవల్లి సీతానగరం సర్పంచులు రైతులు సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజాపాలనలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దరిశెట్టికి వినతి పత్రం అందజేశారు. దీంతో కలెక్టర్ స్పందిస్తూ క్షేత్రస్థాయిలో పరిస్థితిలే పరిశీలించి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంజూరు చేస్తామని వారికి కలెక్టర్ హామీ ఇచ్చారు.
పెద్ద బీరవల్లి సొసైటీ పరిధిలో పెద్ద బీరవల్లి, జానకిపురం సీతానగరం గ్రామపంచాయతీలు ఉన్నాయని, మొత్తం 1806 ఎకరాలలో మొక్కజొన్న పంట సాగు చేశామని వారు కలెక్టర్ కి వివరించారు. ప్రతి సంవత్సరం పెద్ద బీరవల్లి సొసైటీ పరిధిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి మొక్కజొన్నలను కొనుగోలు చేస్తున్నట్లు కలెక్టర్ కు వారు వివరించారు. తాను గతంలో పెద్ద బీరవల్లి సొసైటీ ప్రెసిడెంట్ గ పని చేశానని, ఆ సమయంలో ప్రతి సంవత్సరము రైతుల నుంచి మార్క్ ఫెడ్ ద్వారా ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ద్వారా రైతుల నుంచి మొక్కజొన్నలను కొనుగోలు చేసినట్లు చింతలచెరువు కోటేశ్వరరావు కలెక్టర్కు వివరించారు.
ప్రైవేటు వ్యాపారులు రైతుల నుంచి అతి తక్కువ ధరకు మొక్కజొన్నలు కొనుగోలు చేస్తున్నారని దీని వల్ల రైతులకు ఆర్థికంగా తీవ్ర నష్టం జరుగుతుందని పెద్ద బీరవల్లి సీతానగరం సర్పంచులు చింతలచెరువు కోటేశ్వరరావు కొమ్మ గిరి బిక్షమయ్య కలెక్టర్ కు వివరించారు. దీంతో కలెక్టర్ స్పందిస్తూ పెద్ద బీరవల్లి సొసైటీ పరిధిలో క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంజూరు చేస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు పెద్దపోలు రామారావు, పెద్దపోలు కోటేశ్వరరావు, పిట్టల రామారావు, చింతలచెరువు పాపారావు, చిలక నాగరాజు, చిలక దాసు, చిలక శివ, చిలక యేసురత్నం తదితరులు పాల్గొన్నారు.



