- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
రోజురోజుకూ మండుతున్న ఎండల నేపథ్యంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. దీంతో ప్రధాన కూడళ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉపాధిహామీ కూలీలు మండుతున్న ఎండల్లో కూలి పనులు చేస్తున్న కూలీలకు పని ప్రదేశాల్లో నీరు, నీడ ఏర్పాట్లు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాడిచెర్ల 14వార్డు సభ్యురాలు నారామల్ల రాజేశ్వరి-పోచాలు సోమవారం శాత్రజ్ పల్లిలో కూలి పనులు చేస్తున్న కూలీలకు మజ్జిక ప్యాకేట్స్ పంపిణీ చేశారు. చల్లటి మజ్జికతో ఉపశమనం లభించిందని కూలీలు తెలిపారు.
- Advertisement -



