నవతెలంగాణ – కుభీర్
కుబీర్ మండల కేంద్రమైన కుభీర్ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల, కస్తూరిబా గాంధీ, ఎస్సీ సంక్షేమ వసతి గృహాలతో పాటు డోడర్నా గిరిజన ఆశ్రమ పాఠశాలలను సోమవారం మండల ప్రత్యేక అధికారి శంకర్‌తో పాటు తహశీల్దార్ శివరాజ్, ఎంపీడీవో గంగసాగర్ రెడ్డి, ఎంఈవో విజయ్ కుమార్, ఎంపీవో భీమేష్ లు వేరు వేరుగా పరిశీలించారు. మండల ప్రత్యేక అధికారి శంకర్ గిరిజన బాలికల పాఠశాలను పరిశీలించి మాట్లాడారు. కలెక్టర్ ఆదేశాల మేరకు వసతిగృహాలను తనిఖీ చేశామన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు.
విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనము అదించాలిని తెలిపారు.అనంతరం విద్యార్థులతో కలసి భోజనం చేశారు. పాఠశాలలో ఉన్న సమస్యలపై అరా తీశారు. కోతుల బేడాడ ఎక్కువగా ఉందని గిరిజన ఆశ్రమ పాఠశాల ప్రాథనోపాధయురాలు తిరుమల ప్రత్యేక అధికారి దృష్టికి తీసుకువచ్చారు పాఠశాల పూనా ప్రారంభం నాటికీ పాఠశాలలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. పంచాయతీ కార్యదర్శి జాదవ్ మాధవ్,ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కస్తూరిబా గాంధీ వాణి, తిరుమల, భూమేష్, సిబ్బంది తదితరులు ఉన్నారు.



