Monday, April 20, 2026
E-PAPER
Homeఖమ్మంమొక్కజొన్న కొనుగోలు కేంద్రం కోసం రావినూతల రైతులు ఆందోళన 

మొక్కజొన్న కొనుగోలు కేంద్రం కోసం రావినూతల రైతులు ఆందోళన 

- Advertisement -

తహసిల్దార్ ఛాంబర్ లో గంటన్నర పాటు ఆందోళన 
మొత్తం మూడు గంటలపాటు రైతుల ఆందోళన
అధికారుల హామీతో ఆందోళన విరమణ 
నవతెలంగాణ  – బోనకల్

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని బోనకల్ మండల పరిధిలోనే రావినూతల సొసైటీకి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ రావినూతల రైతులు తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో మూడు గంటలపాటు సోమవారం మండల రైతు వేదిక, తహసిల్దార్ ఛాంబర్ లో ఆందోళన నిర్వహించారు. మండల అధికారుల హామీతో అనంతరం తమ ఆందోళనను విరమించారు. రావినూతల సొసైటీ పరిధిలో రావినూతల, ఆళ్ళపాడు గ్రామాలు ఉన్నాయి. ఈ సొసైటీ పరిధిలో మొత్తం 3270 ఎకరాలలో మొక్కజొన్న పంటను సాగు చేశారు. ఈ రెండు గ్రామాల నుంచి దాదాపు 50 శాతం వరకు పంట కల్లాలలో ఉంది. పంట చేతికి వచ్చిన రావినూతల సొసైటీ క మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంజూరు చేయకపోవడంతో రావినూతల రైతులందరూ రాజకీయాలకు అతీతంగా తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో మండలంలో గల రైతు వేదిక ముందు ఆందోళనకు దిగారు.

ఇదే సమయంలో ముష్టికుంట్లలో రైతుల ఆందోళన విరమించి రైతు వేదకు వద్దకు వచ్చారు. ముష్టికుంట రైతుల కూడా రావినూతల రైతులతో కలిసి ఆందోళనకు దిగారు.సోమవారం ప్రజాపాలన కావడంతో రైతులు ఉదయం 9 గంటల నుంచే తమ ఆందోళన చేపట్టారు. సుమారు 10:30 గంటలు అవుతున్న అధికారులు ఎవరు రాకపోయినా తమ ఆందోళన అక్కడే కొనసాగించారు. ఆ సమయంలో రైతు వేదిక నందు ప్రజా పాలన అధికారులలో కేవలం మండల నాయబ్ తహసిల్దార్ అజ్మీర లక్ష్మణ్ మాత్రమే ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత మండల వ్యవసాయ శాఖ అధికారి పసునూరి వినాయకుడి తమ కార్యాలయం అయిన రైతు వేదిక వద్దకు వచ్చారు. రైతులు తమకు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని మండల వ్యవసాయ శాఖ అధికారిని చుట్టుముట్టి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఆయన వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అయినా ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి స్పందన రాలేదు.చివరకు పదిన్నర గంటల సమయంలో మండల తహసిల్దార్ ఆందోళన వద్దకు వచ్చారు. రైతులు తమ సమస్యను ఆమెకు వివరించారు.

కూడా సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఆయన నుంచి కూడా స్పందన కనిపించలేదు. ఆ తర్వాత ప్రజాపాలనలోకి వెళ్ళకుండా మండల తహసిల్దార్ మండల తహసిల్దార్ కార్యాలయానికి వెళ్లారు. ప్రజా పాలన అధికారులు కూడా తహసిల్దార్ కార్యాలయానికి వెళ్లారు.తమకు ఎటువంటి స్పష్టమైన హామీ ఇవ్వకుండా అధికారులు వెళ్లిపోవడంతో రైతుల కూడా తహసిల్దార్ చాంబర్ లోకి ఆందోళనకు దిగారు. సుమారు గంటన్నర పాటు అక్కడే ఆందోళన నిర్వహించారు. సమస్య తీవ్రంగా ఉండటంతో తహసీల్దార్ పదేపదే జిల్లా కలెక్టర్ అదనప కలెక్టర్కు మెసేజ్ చేశారు. చివరకు గంటన్నర అనంతరం జిల్లా కలెక్టర్ స్పందించి తహసిల్దార్ కు ఫోన్ చేశారు. మంగళవారం కల్లా రావినూతలకు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంజూరు చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.

దీంతో రైతులు తమ ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కిలారు సురేష్, సిపిఐ మండల కార్యదర్శి యంగల ఆనందరావు, టిఆర్ఎస్ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు బంధం నాగేశ్వరరావు మాట్లాడుతూ రావినూతలలో వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు మాట నిలబెట్టుకోలేని ఎడల రైతులను పెద్ద ఎత్తున సమీకరించి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రామినోతుల గ్రామ అధ్యక్ష కార్యదర్శులు షేక్ నన్నేసాహెబ్, ఎర్రగాని నాగరాజు, నాయకులు దొండపాటి సత్యనారాయణ, రైతులు వీరపనేని అప్పారావు తాళ్లూరి సురేష్ గుగులోత్ నరేష్, గుగులోత్ పంతు, మరీదు నారాయణ, రావూరి హుస్సేన్, బోయినపల్లి సైదులు, దేవ్ సింగ్, మంద రామారావు, తన్నీరు పుల్లారావు, కొనకంచి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -