నవతెలంగాణ – అలంపూర్
హెచ్ పి వి వ్యాక్సిన్ బాలికలకు తప్పనిసరిగా వేయించాలని సింగవరం-(1)గ్రామ సర్పంచ్ గొంగల ఈశ్వర్ గ్రామస్తులకు సూచించారు. సోమవారం సింగవరం(1) గ్రామంలో హెచ్ పి వి వ్యాక్సిన్ పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గొంగల్ల ఈశ్వర్ మాట్లాడుతూ 14 సంవత్సరాలు నిండిన బాలికల అందరికీ హెచ్ పి వి వ్యాక్సిన్ వేయడం ద్వారా భవిష్యత్తులో వారికి గర్భస్థ, నోటి, తదితర స్త్రీలకు సంబంధించిన క్యాన్సర్ రాకుండా ముందస్తుగానే నివారించవచ్చునని తెలిపారు. దీనిపై తల్లిదండ్రులు స్పందించి బాలికలకు సామాజిక బాధ్యతగా వ్యాక్సిన్ వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి హసీన, ఆశ వర్కర్ లక్ష్మీదేవి, మల్టీ పర్పస్ వర్కర్ జీవరత్నం తదితరులు ఉన్నారు.
బాలికలకు హెచ్ పీవీ వ్యాక్సిన్ తప్పనిసరి: సర్పంచ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



