Monday, April 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి

ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి

- Advertisement -

నవతెలంగాణ – తుంగతుర్తి
యుటిఎఫ్, టిఏపిఆర్పిఏ ఆధ్వర్యంలో ఈనెల 22న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని యుటిఎఫ్ కార్యాలయంలో హెల్త్ కార్డు కలిగిన వారికి  నిర్వహించే కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని టిఏపిఆర్పిఏ నాయకులు జోగునూరు దేవరాజ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమస్యలు మాట్లాడుతూ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ శిబిరాల్లో నిపుణులైన వైద్యులతో కంటి పరీక్షలు, అవసరమైన వారికి కళ్లద్దాలు పంపిణీ,శస్త్రచికిత్సల కోసం మార్గదర్శకత్వం వంటి సేవలు అందించబడతాయని తెలిపారు. ముఖ్యంగా జర్నలిస్టులు పదవీ విరమణ పొందిన ఉద్యోగుల కోసం ఈ క్యాంపులు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -