Wednesday, September 23, 2026
E-PAPER
Homeతాజా వార్తలుబెంగళూరు-విజయవాడ విమానంలో సాంకేతికలోపం

బెంగళూరు-విజయవాడ విమానంలో సాంకేతికలోపం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : బెంగళూరు-విజయవాడ విమానంలో సాంకేతికలోపం తలెత్తింది. టేకాఫ్‌కు సిద్ధమైన అనంతరం తిరిగి ఎయిర్‌పోర్ట్‌ బేకు విమానం చేరింది. ఈ విమానంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి సహా పలువురు ప్రముఖులు ఉన్నారు. విజయవాడలో జరగనున్న కేబినెట్‌ భేటీలో పాల్గొనేందుకు మంత్రి పయనమయ్యారు. కాగా, విమానం ఎప్పుడు బయలుదేరుతుందనే దానిపై సిబ్బంది సమాచారం ఇవ్వకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. సాంకేతికలోపం ఎప్పుడు పరిష్కారమవుతుందోనని ఎదురుచూస్తూ ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -