Wednesday, September 23, 2026
E-PAPER
Homeజాతీయంనిర్ణయాలన్నీ ఏకగ్రీవం: ఈసీ

నిర్ణయాలన్నీ ఏకగ్రీవం: ఈసీ

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’లో వచ్చిన కథనంపై భారత్ ఎన్నికల సంఘం(ఈసీ) స్పందించింది. తాము తీసుకున్న నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగానే జరిగాయని, “ఏ సంస్థలోనైనా చర్చల సమయంలో భిన్నాభిప్రాయాలు పరిశీలనలు వ్యక్తమవ్వడం సహజమే” అని ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి ఓ ప్రెస్ నోట్ లో స్పష్టం చేశారు.

కాగా, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేష్‌ కుమార్‌పై పార్లమెంటు తక్షణమే అభిశంసన ప్రక్రియను ప్రారంభించాలని ప్రతిపక్ష పార్టీలు బుధవారం డిమాండ్‌ చేశాయి. ఎన్నికల సంఘంలోని ఇద్దరు కమిషనర్లు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు, వివేక్‌ జోషి పది నెలల వ్యవధిలో కనీసం 14 సార్లు కీలక నిర్ణయాలపై అధికారికంగా అభ్యంతరాలు వ్యక్తం చేశారంటూ వెలువడిన కథనంపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టాలని కూడా కోరాయి. ఎన్నికల సంఘంలో ముగ్గురు కమిషనర్లు ఉన్నప్పటికీ, పూర్తి కమిషన్‌కు తెలియకుండా కీలక నిర్ణయాలు తీసుకున్నారని, వాటిలో కొన్ని నిర్ణయాలు అనధికారికమైనవి, చట్టవిరుద్ధమైనవని ఇద్దరు ఎన్నికల కమిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వచ్చిన నివేదికను ప్రతిపక్షాలు ప్రస్తావించాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -