- Advertisement -
నవతెలంగాణ-ఆలేరు టౌను
ఆలేరు పట్టణంలో మంగళవారం మెయిన్ రోడ్డు శ్రీ వినాయక వర్తక సంఘం ఆధ్వర్యంలో సామూహికంగా నిర్వహించిన ప్రత్యేక పూజలలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే, బూడిద భిక్షమయ్యగౌడ్ పాల్గొన్నారు. మహిళలు సామూహికంగా కుంకుమార్చన చేపట్టారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు బూడిద బిక్షమయ్య గౌడ్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలేరు పట్టణ బిఆర్ఎస్ అధ్యక్షులు పుట్ట మల్లేష్, కౌన్సిలర్ యాట శివ ,బిఆర్ఎస్ నాయకులువ్,వర్తక సంఘం సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -



