Tuesday, September 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గణేష్ మండపంలో సామూహిక కుంకుమ పూజలు

గణేష్ మండపంలో సామూహిక కుంకుమ పూజలు

- Advertisement -

హాజరై ప్రత్యేక పూజలు చేసిన పిఏసిఎస్ చైర్మన్ దంపతులు
నవతెలంగాణ – మల్హర్ రావు

గణేష్ నవరాత్రుల ఉత్సవాల్లో మండలంలోని అడ్వాలపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన గణనాథుని మండపంలో మంగళవారం వైభవంగా మహిళలు నియమ, నిష్ఠలతో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య దంపతులు హాజరై గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో వర్ధిల్లాలని గణపతిని వేడుకొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -