- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నిమ్స్ వైద్యుడు, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నోరి లక్ష్మీభాస్కర్ వద్ద భారీగా ఆస్తులు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆయన నివాసంతో పాటు మరో ఏడు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించిన అధికారులు దాదాపు రూ.80 కోట్లకుపైగా విలువైన స్థిర, చరాస్తులను గుర్తించినట్టు సమాచారం. కూకట్‌పల్లిలో రెండు విలాసవంతమైన ఫ్లాట్లు, మణికొండ, పేట్ బషీర్‌బాద్, కూకట్‌పల్లిలో 5 అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు, విశాఖలో 800 గజాల స్థలం.. తదితర ఆస్తులతోపాటు పెద్ద మొత్తంలో బంగారం, నగదు ఉన్నట్లు తెలుస్తోంది.
- Advertisement -



