Tuesday, September 22, 2026
E-PAPER
Homeజిల్లాలుఅనుమతి లేకుండా తరలిస్తున్న పశువుల పట్టివేత

అనుమతి లేకుండా తరలిస్తున్న పశువుల పట్టివేత

- Advertisement -

రెండు బులెరో వాహనాలపై కేసు నమోదు 
నవతెలంగాణ-మిడ్జిల్

నాగర్‌కర్నూల్‌ నుంచి అక్రమంగా పశువులను తరలిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు పోలీసులు మంగళవారం తెల్లవారు జామున మిడ్జిల్‌ టోల్‌గేట్‌ సమీపంలో నిఘా ఉంచారు. ఈ మేరకు అనుమానాస్పదంగా వచ్చిన వాహనాలను తనిఖీ చేశారు. ఇందులో భాగంగా నాలుగు బొలేరో వాహనాలను, అందులో తరలిస్తున్న పశువులను పట్టుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా పశువులను తరలిస్తున్నట్టు గుర్తించారు. వెంటనే ఆ నాలుగు వాహనాలతో పాటు పశువులను మిడ్జిల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రెండు వాహనాలకు అనుమతులు ఉండడంతో వదిలిపెట్టినట్లు ఎస్ఐ తెలిపారు. అనుమతి లేని రెండు బులోరా వాహనాల యజమాని, డ్రైవర్, మహమ్మద్ ఆదిల్, అఖిల్ లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం పశువులను వెల్దాండ గోశాలకు తరలించినట్టు తెలిపారు. అనుమతులు లేకుండా పశువులను తరలిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని ఎస్సై శ్రీనివాసులు హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -