Wednesday, April 30, 2025
Homeజాతీయంసల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపులు

సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపులు

నవతెలంగాణ – హైదరాబాద్: బాలీవుడ్ కండ‌ల‌వీరుడు స‌ల్మాన్ ఖాన్‌కు మ‌రోసారి తీవ్ర బెదిరింపులు వ‌చ్చాయి. “స‌ల్మాన్… నిన్ను ఇంట్లోనే చంపుతాం. లేదా నీ కారుని బాంబు పెట్టి పేల్చేస్తాం” అని ముంయిలోని వర్లి రవాణా శాఖ వాట్సాప్ నంబర్ కు సందేశం వ‌చ్చింది. దాంతో వర్లి పోలీస్ స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అస‌లు ఈ మేసేజ్ ఎక్క‌డి నుంచి వ‌చ్చింది, సీరియ‌స్ వార్నింగా లేక కావాల‌ని ఎవ‌రైనా సందేశం పంపించారా అనే విష‌యాన్ని తేల్చేప‌నిలో వ‌ర్లి పోలీసులు ఉన్నారు. కాగా, గ‌తంలో స‌ల్లూ భాయ్‌ను చంపుతామంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప‌లుమార్లు బెదిరించిన విష‌యం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img