Wednesday, April 30, 2025
Homeసినిమాఅన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో 'సోదరా'

అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో ‘సోదరా’

brother

సంపూర్ణేష్‌ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘సోదరా’. ఈ చిత్రంలో ఆయనతోపాటు సంజోష్‌ కూడా ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. ప్రాచీబంసాల్‌, ఆరతి గుప్తా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి మోహన్‌ మేనంపల్లి దర్శకుడు. చిత్రీకరణ పూర్తిచేసుకుని, నిర్మాణానంతర పనులను శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం ఈనెల 25న వేసవి కానుకగా ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌చేయడానికి థియేటర్స్‌ల్లో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ట్రైలర్‌ విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ చిత్ర ట్రైలర్‌ను దర్శకుడు సాయి రాజేష్‌, నిర్మాత ఎస్‌కేఎస్‌లు ముఖ్య అతిథులుగా విచ్చేసి విడుదల చేశారు. ఈ సందర్భంగా సాయి రాజేష్‌ మాట్లాడుతూ, ‘సంపూతో నేను సినిమా తీసి 13 ఏళ్లు అయ్యింది. ‘హదయ కాలేయం’ సూపర్‌హిట్‌ తరువాత సంపూ నన్ను ఆర్థికంగా చాలా ఆదుకున్నాడు. తాను సంపాందించుకున్న డబ్బులో అందరికి సహాయం చేస్తుంటాడు. సంపూ నా దష్టిలో స్టార్‌’ అని అన్నారు. ‘ఈ సినిమా పవన్‌కల్యాణ్‌ ‘బ్రో’ సినిమాలా ఘన విజయం సాధించాలని, అందరికి మంచి గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాను నేను థియేటర్‌లో ఒక షో బుక్‌ చేసుకుని మా ఫ్రెండ్స్‌ అందరికి చూపిస్తాను. ఇలాంటి చిన్న సినిమాలను నా వైపు నుంచి ప్రోత్సాహించాలనే బాధ్యత వల్ల ఈ నిర్ణయం తీసుకుంటున్నాను’ అని ఎస్‌కేఎన్‌ అన్నారు. సంపూర్ణేష్‌ బాబు మాట్లాడుతూ, ‘నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన సాయి రాజేష్‌ ఈ వేడుకకు రావడం హ్యపీగా ఉంది. అప్‌డేట్‌ అయిన తమ్ముడు, అమాయకుడైన అన్న మధ్య జరిగే స్వచ్ఛమైన కథే ఈ సినిమా. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కంటెంట్‌కు మంచి స్పందన వచ్చింది. నేను రియల్‌లైఫ్‌లో ఎలా ఉంటానో అలాంటి పాత్రని ఇందులో చేశాను. అందరూ ఈ సినిమాను ఆదరించి మాకు మంచి విజయం అందిస్తారని కోరుకుంటున్నాను’ అని తెలిపారు. ఈ వేడుకలో దర్శకుడు మోహన్‌ మైనంపల్లి, దర్శకుడు కష్ణ చైతన్య, హీరో చైతన్య, దర్శకుడు నవీన్‌ మేడారం, డిఓపీ జాన్‌, ఎడిటర్‌ శివ,లిరిక్‌ రైటర్‌ పూర్ణాచారి, హీరోయిన్‌ ఆర్తి గుప్తా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img