నవతెలంగాణ – అశ్వారావుపేట
గత మూడు రోజులు ఎడతెరిపిలేని జల్లులతో జన జీవనం అశ్వారావుపేట నియోజక వర్గం లో శుక్రవారం కాస్త తెరిపి నిచ్చింది. జిల్లా కలెక్టర్ విడుదల చేసిన వర్షపాతం నివేదిక ప్రకారం నియోజక వర్గంలో గురువారం ఉదయం 8.30 గంటలు నుండి శుక్రవారం ఉదయం 8.30 గంటలు వరకు నియోజక వర్గం వ్యాప్తంగా 109.5 మి.మీ వర్షపాతం నమోదు కాగా నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో అత్యధికంగా 18.8 మి.మీ లు వర్షపాతం నమోదు అయింది.అత్యల్పంగా చండ్రుగొండ మండలం మద్దుకూరు లో 8.8 మి.మీ వర్షపాతం,దమ్మపేట మండలం నాయుడుపేట లో జీరో వర్షపాతం నమోదైంది. నియోజక వర్గం లోని 5 మండలాల పరిధిలో దమ్మపేట మండలంలో 5,మిగతా మండలాల్లో ఒక్కోటి చొప్పున మొత్తం 9 ప్రాంతాల్లో వర్షం నమోదు చేసే యూనిట్ ఉన్నాయి.
ప్రాంతం మండలం వర్షపాతం మిమీ లో
అశ్వారావుపేట ———– 18.8
మల్కారం దమ్మపేట 16.0
నాగుపల్లి // 15.5
ములకలపల్లి ———- 15.3
అంకంపాలెం // 13.3
పెంట్లం అన్నపురెడ్డిపల్లి 12.8
మందలపల్లి దమ్మపేట 9.0
మద్దుకూరు చండ్రుగొండ 8.8
నాయుడుపేట దమ్మపేట 0.0
మొత్తం 109.5
మండలాల వారీగా అయితే దమ్మపేట మండలంలో అత్యధికంగా 53.8 మి.మీ,అత్యల్పంగా చండ్రుగొండ మండలంలో 8.8 మి.మీ వర్షపాతం నమోదు అయింది.
మండలం వర్షపాతం మి.మీ లో
దమ్మపేట 53.8
అశ్వారావుపేట 18.8
ములకలపల్లి 15.3
అన్నపురెడ్డిపల్లి 12.8
చండ్రుగొండ 8.8
మొత్తం 109.5
నియోజక వర్గంలో అన్ని ప్రాంతాల్లో వర్షం వచ్చినా దమ్మపేట మండలం నాయుడుపేట లో వర్షం లేకపోవడం విశేషం.