నవతెలంగాణ-హైదరాబాద్: ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్న దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ మున్సిపల్ విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఏసురత్నం పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం ఆయన పలువురు నాయకులతో కలిసి నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సాబేర్ ఆలీకి సమ్మె నోటీసు అందజేశారు. అనంతరం ఏసురత్నం మాట్లాడుతూ.. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తన కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను, కార్పొరేట్ అనుకూల, మతోన్మాద చర్యలను మరింత దూకుడుగా అమలు చేస్తున్నదని ఆరోపించారు. కార్మికవర్గం సమరశీల పోరాటాల ద్వారా 100 సంవత్సరాలలో సాధించుకొన్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను ముందుకు తెచ్చిందని ఏసురత్నం అన్నారు. ఈ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా గత ఇదేళ్లగా కార్మికవర్గం చేస్తున్న ఆందోళన, పోరాటాలతో లేబర్ కోడ్ల అమలు ఐదేండ్లు ఆలస్యమైనా, ఇప్పుడు మళ్లీ వాటిని అమలు చేసి కార్మిక హక్కులను పూర్తిగా హరించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చేశారు. ఈ నేపథ్యంలోనే కార్మిక, కర్షక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టేందుకుగాను ఈనెల 20వ తేదీన జరగబోయే సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ నెల 20న చేపట్టే సమ్మెను జయప్రదం చేయండి: ఏఐటీయూసీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES